Radhika Apte : ఎప్పటికప్పుడు బోల్డ్ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచే నటి రాధికా ఆప్టే. తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ధోని, లెజెండ్, లయన్ వంటి మూవీస్ లో నటించి మంచి గుర్తింపు సాధించుకుంది. బాలీవుడ్ లోనూ బోల్డ్ రోల్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న ఈ భామ… తాజాగా హాలీవుడ్ మూవీస్ లోనూ నటిస్తూ బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే ఆమె చేసిన కామెంట్స్ వైరలయ్యాయి. ఆమె రీసెంట్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆయా మూవీస్ లో బోల్డ్ సీన్స్‌లో యాక్ట్ చేయడం గురించి ఆమె పలు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
తాజాగా ఓ డైరెక్టర్ ఆమెను వేశ్య రోల్ చేయాలని ఆఫర్ ఇచ్చారని చెప్పకొచ్చింది ఈ అమ్మడు. డైరెక్టర్ అలా చెప్పడంతో షాక్‌కు గురైందట రాధికా. ఇక ఇంకో డైరెక్టర్ సైతం లైంగికదాడులకు రిలేటెడ్ మూవీని తీస్తున్నాడని.. అందులో తనకు ఒక పిచ్చి కాన్సప్ట్ చెప్పాడంటూ వివరించింది ఆప్టే. అయితే బోల్డ్ సీన్స్ లో యాక్ట్ చేయడం తప్పుకాదని స్టోరీ డిమాండ్ చేసే అలాంటి సీన్స్ లో యాక్ట్ చేయాలని చెప్పుకొచ్చింది ఈ భామ. కానీ ఓన్లీ అలాంటి స్టోరీలకు మాత్రమే తాను ఓకే చెప్పలేనని.. తన బాడీ విషయంలో తనకు ఫ్రీడం ఉందని వివరించింది. ఎలాంటి స్టోరీకి పడితే అలాంటి స్టోరీకి తాను ఓకే చెప్పలేనని కామెంట్స్ చేసింది. అయితే ఇప్పటి వరకు తాను చేసిన మూవీస్ అన్నీ తన మనసుకు నచ్చినవేనని కామెంట్స్ చేయడం గమనార్హం. మరి తన తదుపరి మూవీస్‌లో ఈ అమ్మడు ఎలాంటి రోల్స్ చేస్తుందో చూడాలి మరి.
Read Also : Bigg Boss 5 Telugu : సిరిపై ఫైర్ అయిన షణ్ను.. బాత్రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేసిన సిరి..!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world