...

Actress Poorna : టాలీవుడ్‌లో సినిమాలు చేయాలంటే వాటికి ఒప్పుకోవాలి: పూర్ణ

Actress Poorna : పూర్ణ. అల్లరి నరేష్ నటించిన సీమ టపాకాయ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రవి బాబు డైరెక్ట్ చేసిన అవును, అవును2, లడ్డు బాబు వంటి సినిమాలతో ప్రేక్షకులను చాలా అలరించింది. ఆ మధ్య రాజ్ తరుణ్ వంటి యంగ్ హీరో నటించిన పవర్ ప్లే అనే సినిమాలో నెగటివ్ రోల్ కూడా చేసి అందర్నీ మెప్పించింది.

ఈ సినిమాలో పూర్ణ తన చిన్న నాటి ఫ్రెండ్ కోసం హీరోని చంపాలని చూస్తుంది. అంతే కాకుండా నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండ సినిమాలో కూడా ఈ అమ్మడు నటించింది. అఖండ సినిమాలో ఈ అమ్మడు చేసిన పద్మావతి అనే క్యారెక్టర్ కు మంచి మార్కులే పడ్డాయి. కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగం చేసే పాత్రలో ఈ బ్యూటీ ఒదిగిపోయింది.

ఈ చిన్నది తాజాగా అలీతో సరదాగా షోకు వచ్చింది. అఖండ సినిమా విలన్ అయిన శ్రీకాంత్ తో పాటు ఈ చిన్నది కలిసి వచ్చింది. అప్పడే అలీతో శ్రీకాంత్ జోక్ చేస్తూ నేను వరదరాజులుగా నటించాలా? లేదా శ్రీకాంత్ గా నటించాలా? అని అంటాడు. ఇక షో నడుస్తున్న సందర్భంగా అలీ వారిద్దరి పర్సనల్ విషయాలను రాబట్టే ప్రయత్నం చేశాడు.

ఎప్పుడో ఇండస్ట్రీకి వచ్చిన మీరు ఇన్ని తక్కువ సినిమాలు చేయడానికి గల కారణం ఏంటని పూర్ణను అడగ్గా ఆ అమ్మడు దిమ్మతిరిగే సమాధానం చెప్పింది. ఇక్కడ సినిమాలు చేయాలంటే చాలా విషయాలకు ఎస్ చెప్పాలి. కానీ నేను చాలా సందర్భాల్లో నో చెప్పాను. అందుకోసమే ఎక్కువగా సినిమాలు చేయలేకపోయాను అని చెప్పి అందర్నీ షాక్ కు గురిచేసింది. ఈ తాజా ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Read Also : South Heroes: ఈ సౌత్ హీరోలు స్టైల్‌కి ఐకాన్స్.. వెడ్డింగ్ డిజైన్స్‌లో ఎలా ఉన్నారో చూడండి