Hanuman Birthplace : శ్రీరాముని పరమ భక్తుడు అంజని పుత్రుడు జన్మస్థలం ఎక్కడ అని చాలామంది భక్తులలో అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆంజనేయుడు జన్మస్థలం గురించి రగడ మొదలైంది అంజనీ పుత్రుడు మా ప్రాంతానికి చెందినవాడంటే.. మ వాడంటు పలు ప్రాంతాల ప్రజలు పోటీ పడుతున్నారు. అయితే పురాణ ఇతిహాసాల ప్రకారం ఆంజనేయుడు జన్మస్థలం ఎక్కడ? అన్న ప్రశ్నకు అనేక సమాధానాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలవారు ఆంజనేయుడు మావాడు అంటూ క్లెయిమ్ చేసుకున్నారు. లేదు ఆంజనేయులు మా ప్రాంతానికి చెందిన వాడు కావాలంటే రుజువులు చూపిస్తాం అంటూ మరికొందరు డిబెట్లకి కూడా ఆహ్వానిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఈ ప్రశ్నకు సరైన సమాధానం మాత్రం లభించలేదు. అయితే ఆంజనేయుడు మా ప్రాంతానికి చెందినవాడు అంటూ ఏ ఏ ప్రాంతాల వారు క్లైం చేసుకున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

తిరుమలలోని అంజనాద్రి ఆంజనేయుడు జన్మస్థలం అంటూ పురాణ ఇతిహాసాలు, చరిత్రకారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఈ మధ్యకాలంలోనే టిటిడి ఒక కమిటీ వేసి నిర్ధారించింది. అయితే మరికొంతమంది మాత్రం కర్ణాటకలోని హంపీ లో ఆంజనేయుడు జన్మించాడని విశ్వసిస్తున్నారు. ఇదిలా ఉండగా కర్ణాటకలోని అరేబియా సముద్రం ఒడ్డున ఆంజనేయుడు జన్మించాడని కొంతమంది వాదన వినిపిస్తున్నారు.
అయితే హర్యానాలోని కపితల్ ఈ ప్రాంతంలో ఆంజనేయుడు జన్మించాడు అంటూ అక్కడి ప్రజలు క్లెయిమ్ చేసుకున్నారు. తాజాగా మహారాష్ట్రలోని అంజనేరి పర్వతాల్లో అంజనీ పుత్రుడు జన్మించాడు అని వాదన వినిపిస్తోంది. ఈ వివాదాన్ని పరిష్కరించటానికి శ్రీ మందలచార్యా పీఠాధిపతి స్వామి అనికేత్ శాస్త్రీ దేశ్ పాండే మహరాజ్ నాసిక్ లో ధర్మ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు పలు ప్రాంతాల నుండి సాధువులు పాల్గొననున్నారు. ఈ సదస్సులో సాధువులు హనుమంతుడు జన్మ స్థలం గురించి వారి అభిప్రాయాలను తేయచేయనున్నారు.
Read Also : Hanuman Chalisa : ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. హనుమాన్ చాలీసా చదవాల్సిందే!