Yoga Back Pain : పంచానికి భారతదేశం అందించిన దివ్య ఔషధం యోగా. కాగా యోగ చేయడం ద్వారా మానసిక, శారీరక ఉల్లాసం లభిస్తాయి. ప్రతీ రోజు యోగా చేయడం వల్ల మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. ఇకపోతే ఇటీవల కాలంలో చాలా మంది బ్యాక్ పెయిన్, కాళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతున్నారు. మూడు పదుల వయసు లోపు వారు మాత్రమే కాకుండా, పిల్లలు కూడా బ్యాక్ పెయిన్, నడుము, కాళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతున్నారు. వారందరూ ఈ యోగా ఆసనాలు చేస్తే నొప్పులు ఇట్టే మాయమై ఆరోగ్యంగా ఉంటారు.

సుఖాసనం అనగా క్రాస్ లెగ్ సీట్ పోజ్.. ఈ ఆసనంలో కూర్చొని ఫుడ్ తీసుకుంటే హెల్త్‌కు చాలా మంచిది. ఇలా చేయడం ద్వారా మీరు వెయిట్ కూడా ఆటోమేటిక్‌గా లాస్ అవుతారు. దాంతో పాటు మీ శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలు, మినరల్స్ సమపాళ్లలో అన్ని భాగాలకు అందుతాయి. ఇకపోతే ఈ ఆసనంలో కూర్చొవడం వలన మీ బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంది. స్పైనల్ కార్డ్ ఇష్యూస్ కూడా రిజాల్వ్ అవుతాయి. సరళ సిద్ధాసనం కూడా చాలా ఆరోగ్యకరమైన ఆసనం.. ఇందుకుగాను మీరు నేల మీద కూర్చొని ఒక కాలును మరొక దానిపైన పెట్టాలి. అలానే ఇంకో కాలును మరొక కాలు మీద పెట్టి ఉంచాలి.
అలా జాగ్రత్తగా మీరు ఎముకల మీద కూర్చొని ప్రాణాయామ, మెడిటేషన్ చేయాలి. అలా చేయడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. ఈ ఆసనం వల్లన మీ కాళ్లు స్ట్రెచ్ అవడంతో పాటు మీ బోన్స్‌కు ఎనర్జీ లభిస్తుంది. దాంతో పాటు ఎముకలు స్ట్రాంగ్‌గా అవుతాయి. బాడీ ఫ్లెక్సిబిలిటీ కూడా ఇంప్రూవ్ అయి ఆటోమేటిక్‌గా మీ తొడలు, నడుము భాగం స్ట్రెచ్ అవుతుంది.
లోయర్ బ్యాక్ కూడా ఫ్రీ అవుతుంది. పెయిన్స్ అన్నిటి నుంచి కూడా రిలీఫ్ లభిస్తుంది. అయితే, ఈ ఆసనాలు వేసే క్రమంలో మీరు తొలిసారి వేయబోతున్నట్లయితే యోగా నిపుణులు లేదా ఇన్‌స్ట్రక్టర్స్ పర్యవేక్షణలోనే ఆసనాలు వేయాలి.
Read Also : Ayurvedic Tips for Cough : ఊపిరాడనంతగా దగ్గు వస్తుందా..? ఒకే ఒక్క ఆయుర్వేద చిట్కా..!