Post Pregnancy Diet: చాలా మంది మహిళలు గర్భదారణ సమయంలో కేవలం ఆహారం తీసుకుంటే సరిపోతుందని భావిస్తారు. కానీ డెలివరీ తర్వాత మహిళలు తమ పాత స్వభావానికి తిరిగి రావడానికి ఈ పోషకాలు చాలా అవసరం. అందుకే పాలిచ్చే తల్లులు, బాలింతలు కచ్చితంగా ఈ డైట్ ను ఫాలో అవ్వాలి. అయితే ఆ డైట్ చార్ట్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సాల్మన్.. మీరు మాంసాహారం తినే వాళ్లే అయితే సాల్మన్ చేపలను తీసుకోవచ్చు. ఇందులో డోకోసా హెక్సేనోయిక్ యాసిడ్ ఉంటుంది. పిల్లల నాడీ వ్యవస్థ అభివృద్ధికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి బాలింతలు ఈ చేపాలని వారానికి రెండు సార్లు తీసుకోవాలి. పాల ఉత్పత్తులు.. పాల ఉత్పత్తుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిలో విటామిన్ బి, ప్రోటీన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇది డెలివరీ తర్వాత తల్లులకు ఎముకల ఆరోగ్యాన్ని పనురుద్ధరించడంలో సహాయపడుతుంది. అలాగే శిశువులో ఎముకల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
డెలివరీ తర్వాత పప్పులు.. బీన్స్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బ్లాక్ బీన్స్ రొమ్ము పాల స్రవానిహకి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు సలాడ్ మొదలైన వాటిపో పప్పులను తినవచ్చు. మీకు అవసరమైన ప్రోటీన్ ఇలా అందుతుంది. బ్లూ బెర్రీస్, బ్రౌన్ రైస్, నారింజ, గుడ్లు, బ్రొకోలీ, అకాడో, ఆరోగ్యకరమైన ద్రవ పదార్థాలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే బాలింతలు కాస్త గట్టి పడి శిశువు బలంగా తయారవడానికి సాయపడతారు. ముఖ్యంగా గర్భదారణ మొదటి త్రైమాసికంలో ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండాలి. ముఖ్యంగా తల్లి పాలివ్వడానికి ముందు ఒక గ్లాసు నీళ్లు తాగాలి. మనం ఇంట్లో తయారు చేసుకున్న పండ్ల రసాలు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.