Diabetic Patients: మధుమేహ రోగులకు తీపి కబురు, ఏంటంటే?

Diabetic Patients: మధుమేహ రోగులకు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ మెడికల్ రీసెర్స్ తీపి కబురు చెప్పింది. ఒకసారి టైప్-2 డయాబెటిస్ బారిన పడితే ఇక జీవితాంతం మందులు వాడాల్సిందేనన్న వార్త నిజం కాదని.. డయాబెటిస్ నుంచి పూర్తిగా కోలుకోవచ్చని తెలిపింది. నిత్యం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లను సగం శాతానికి తగ్గించుకోవడం, అదే సమయంలో ప్రోటీన్ల శాతాన్ని పెంచుకోవడం ద్వారా షుగర్ వ్యాధిని శాశ్వతంగా దూరం చేసుకోవచ్చని వివరిస్తోంది. మధుమేహం బారిన పడబోయే వాళ్లు షుగర్ రాకుండా నివారించుకోవచ్చని స్పష్టం చేస్తోంది.

Advertisement

Advertisement

అయితే భారతీయ పరిశోధన సంస్థ(ఐసీఎంఆర్) ఇండియా రీసెర్స్ ప్రకారం రోజురోజుకూ మధుమేహ బాధితుల సంఖ్య పెరుగుతుందని తెలిపింది. ప్రస్తుతం 7.40 కోట్ల మంది షుగర్ బాధితులు ఉండగా.. మరో 8 కోట్ల మంది ప్రీడయాబెటిక్ దశలో ఉన్నట్లు గుర్తించింది. కార్బోహైడ్రేట్ల వినియోగం చాలా ఎక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం అని వివరించారు. మధుమేహం నుంచి పూర్తిగా బయటపడాలనుకున్న వాళ్లు కార్బోహైడ్రేట్లను 55 శాతానికి తగ్గించుకోవాలని అలాగే ప్రోటీన్లను 20 శాతాన్ని పెంచుకోవాలని సూచించారు.

Advertisement

అలాగే రోజు 45 నిమిషాల పాటు వాకింగ్, ఒత్తిడి తగ్గించుకోవడం వంటివి చాలా బాగా ఉపయోగ పడతాయన్నారు. ఇందుకోసం ప్రాణాయామం, మెడిటేషన్ చేయాలన్నారు. రాత్రిపూట కనీసం 6 నుంచి 7 గంటల పాటు పడుకోవాలన్నారు. రోజూ శరీర బరువును బట్టి 3 నుంచి 3.5 లీటర్ల నీరు తాగాలని సూచించారు. స్మోకింగ్ చేసే వాళ్లు పూర్తిగా ఆపేయాలని.. విటామిన్ డి తక్కువైన షుగర్ లెవెల్స్ పెరుగుతాయని తెలిపారు.

Advertisement
Advertisement