Vegetables: వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించే ఐదు రకాల కూరగాయలు ఇవే..!

Vegetables: వేసవికాలం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భగభగ మండే ఎండల్లో ఇంటి నుండి బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.అయితే ఈ వేసవి కాలంలో అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో కొన్ని రకాల కూరగాయలు చేర్చుకోవాలి. కొన్ని రకాల సీజనల్ కూరగాయలను తినటం వల్ల వేసవి కాలంలో శరీర అధిక ఉష్ణోగ్రత తగ్గించడంలో ఈ కూరగాయలు ఎంతో ఉపయోగపడతాయి. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో ఈ 5 రకాల కూరగాయలు తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన నీరు లభించి అనారోగ్య సమస్యలు తలెత్తవు.

• వేసవి కాలంలో లభించే కూరగాయలు దోసకాయ కూడా ఒకటి. ఈ దోసకాయల లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దోసకాయల లో విటమిన్ సి విటమిన్ కె వంటి పోషకాలు ఉంటాయి. వేసవికాలంలో దోసకాయను తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన నీటి శాతం లభించి శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతాయి.అందువల్ల వేసవికాలంలో ప్రతిరోజు దోసకాయలు తప్పనిసరిగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

• వేసవి కాలంలో లభించే కూరగాయలు గుమ్మడికాయ కూడా ఒకటి. గుమ్మడికాయలో బీటా కెరోటిన్, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి.గుమ్మడి కాయలో ఉండే విటమిన్ ఎ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి అనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. ప్రతి రోజు ఏదో ఒక రూపంలో గుమ్మడికాయ ఆహారంగా తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.

• కాకరకాయలు ఏ సీజన్లో అయినా లభిస్తాయి. కాకరకాయ చేదుగా ఉండటం వల్ల చాలామంది అవి తినడానికి ఇష్టపడరు. కానీ అందులో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.వేసవికాలంలో మధుమేహ వ్యాధిగ్రస్థులు ప్రతిరోజు ఈ కాకరకాయ జ్యూస్ తాగటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. వేసవి కాలంలో ప్రతి రోజు ఈ కాకరకాయలు తినటం మంచిదని న్యూట్రీషన్లు సూచిస్తన్నారు.

Advertisement

• వేసవికాలంలో సొరకాయ తినటం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. సొరకాయ లో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వేసవికాలంలో సొరకాయ తినటం వల్ల శరీరానికి కావలసిన నీటి శాతం లభిస్తుంది. అంతేకాకుండా సొరకాయ తినటం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.

• వేసవికాలంలో పచ్చి బఠాణీలు తినటం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చి బఠాణీలలో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్, ఫైబర్, జింక్,
వంటి పోషకాలు ఉంటాయి. వీటిలో కేలరీలు తక్కువ మోతాదులో ఉండటం వల్ల వీటిని తినడం వల్ల అధిక బరువు సమస్య కూడా తగ్గించవచ్చు.

Advertisement