Liver Failure: ప్రస్తుత కాలంలో ఆహార అలవాట్లు, జీవన శైలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. పని ఒత్తిడి కారణంగా సమయానికి ఆహారం తీసుకోకపోవటం, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తినటం వల్లఎక్కువగా జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతే కాకుండా, ఫ్యాటీ లివర్, లివర్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది.ఇటీవల శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో హైపటైటిస్ వ్యాధితో బాధపడుతున్న 18 సంవత్సరాల లోపు పిల్లల్లో ఈ లివర్ ఫెయిల్యూర్ సమస్య అధికంగా ఉందని వెల్లడయ్యింది. ఈ లివర్ సమస్య లక్షణాలు, దానిని ఎలా నివారించాలి అన్న విషయం గురించి తెలుసుకుందాం.
లివర్ పెళ్లిరోజు సమస్య తలెత్తినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అలా కాకుండా ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ లివర్ ఫెయిల్యూర్ సమస్య తలెత్తినప్పుడు శరీరం బలహీనంగా ఉండటం, వాంతులు, రక్తంతో కూడిన విరేచనాలు, ఉబ్బసం, కల్లు పసుపురంగులో మారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే అది కచ్చితంగా లివర్ ఫెయిల్యూర్ అయ్యిందని సంకేతం. ఈ లక్షణాలు గుర్తించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ నీ సంప్రదించాలి.
ఈ వ్యాది రాకుండా ఉండటానికి మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం కాలంలో యువత రుచికరంగా ఉంటాయని ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినటానికి ఇష్టపడుతున్నారు. అందువల్ల 18 సంవత్సరాల లోపు వయసు గల పిల్లల్లో వ్యాది నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఈ లివర్
ఫెయిల్యూర్ , ఫ్యాటీ లివర్ సమస్య తలెత్తుతాయి. కాబట్టి పిల్లలు తినే ఆహారం విషయంలో జాగ్రత్త పడి మంచి పౌష్టిక ఆహారం తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World