Entertainment – Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com https://tufan9.com Telugu News : Live Updates Online on Andhra Pradesh, Telangana, Hyderabad, Politics, Crime, Sports, Cricket, Business, Education, Jobs, Entertainment, Technology, Health. Tufan9 Telugu covers Today’s breaking News, Top Headlines in Telugu Language Online Sat, 12 Apr 2025 18:04:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.1 https://tufan9.com/wp-content/uploads/2021/10/cropped-tufan9-favicon-32x32.png Entertainment – Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com https://tufan9.com 32 32 Peddi First Look : ‘పెద్ది’ ఫస్ట్ లుక్.. హ్యాపీ బర్త్‌డే రామ్ చరణ్ సార్.. జాన్వీ కపూర్ స్పెషల్ విషెస్.. వైరల్..! https://tufan9.com/entertainment-news/peddi-first-look-janhvi-kapoor-wishes-her-peddi-ram-charan-happy-birthday-telugu.html Thu, 27 Mar 2025 09:43:51 +0000 https://tufan9.com/?p=39111 Peddi First Look : జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

The post Peddi First Look : ‘పెద్ది’ ఫస్ట్ లుక్.. హ్యాపీ బర్త్‌డే రామ్ చరణ్ సార్.. జాన్వీ కపూర్ స్పెషల్ విషెస్.. వైరల్..! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Peddi First Look : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన కొత్త మూవీ ‘పెద్ది’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ యూనిట్ పెద్ది మూవీ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా సినీనటి జాన్వీ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పెషల్ పోస్టు పెట్టింది. ఇప్పుడు ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

చరణ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌లను షేర్ చేస్తూ.. “హ్యాపీ బర్త్‌డే సర్ @alwaysramcharan #Peddi @buchibabu_sana rathnaveludop @arrahman @mythriofficial @sukumarwritings” అని క్యాప్షన్ ఇచ్చింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఫైర్ ఎమోజీలతో ఆసక్తికరమైన పోస్టర్‌లను కూడా షేర్ చేసింది.

పెద్ది మూవీలో రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ తొలిసారిగా తెరపై కలిసి నటించింది. రామ్ చరణ్ 40వ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు సానా రాబోయే యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ నిర్మాతలు తమ చిత్రానికి ” పెద్ది” అనే టైటిల్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.

Peddi First Look : పెద్ది మూవీ పోస్టర్లు రిలీజ్ :

రామ్ చరణ్ నటించిన ఈ మూవీకి సంబంధించి రెండు కొత్త పోస్టర్లను కూడా ఆవిష్కరించారు. ఒక పోస్టర్ చెర్రీ ఫేస్ క్లోజప్‌తో కనిపిస్తుంది. మరొకటి యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు చూపిస్తుంది. ఈ రెండు పోస్టర్లు చరణ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లుక్‌లో కనిపిస్తున్నాయి. పోస్టర్‌లో రామ్ చరణ్ లుక్ అదిరింది. చింపిరి జుట్టు, గడ్డం, గాంభీరమైన చూపు మరింత ఆకర్షణగా కనిపిస్తోంది. క్లోజప్ షాట్‌లో రామ్ చరణ్ చేతిలో బీడీ వెలిగించుకున్నట్లు కనిపించాడు.

ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. #RC16 #PEDDI హ్యాపీ బర్త్ డే గ్లోబల్ స్టార్ @AlwaysRamCharan” అని పోస్టులో రాసి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ మూవీకి నిర్మాతలు పాన్-ఇండియా కోలాహలం అంటూ ప్రశంసిస్తున్నారు, ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ క్రియేటివిటీ విజువల్‌తో సమర్పిస్తున్నారు.

Read Also : SBI Prelims Result 2025 : ఎస్బీఐ ప్రిలిమినరీ పరీక్ష 2025 ఫలితాలు త్వరలో విడుదల.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

సినీవర్గాల సమాచారం ప్రకారం.. #RC16 భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్స్, ప్రపంచ స్థాయి నిర్మాణ ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో రూపుదిద్దుకుంటోంది.

ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక రోల్ పోషిస్తున్నారు. రామ్ చరణ్ తో పాటు, జాన్వి, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

The post Peddi First Look : ‘పెద్ది’ ఫస్ట్ లుక్.. హ్యాపీ బర్త్‌డే రామ్ చరణ్ సార్.. జాన్వీ కపూర్ స్పెషల్ విషెస్.. వైరల్..! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Rajendra Prasad : ఇకపై అలా జరగదు.. క్రికెటర్ వార్నర్‌కు నటుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు.. వీడియో! https://tufan9.com/entertainment-news/tollywood-actor-rajendra-prasad-apologises-to-david-warner-telugu.html Tue, 25 Mar 2025 15:07:55 +0000 https://tufan9.com/?p=39095 Rajendra Prasad : నటుడు రాజేంద్రప్రసాద్ డేవిడ్ వార్నర్‌‌పై చేసిన అవమానకర వ్యాఖ్యలకు తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

The post Rajendra Prasad : ఇకపై అలా జరగదు.. క్రికెటర్ వార్నర్‌కు నటుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు.. వీడియో! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Rajendra Prasad : క్రికేటర్ డేవిడ్ వార్నర్‌కు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పారు. రాబిన్‌హుడ్‌ మూవీలో వార్నర్‌ గెస్ట్ రోల్ చేశాడు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు వార్నర్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా క్రికెటర్‌ను ఉద్దేశించి రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఆ సినిమాలో ఒక రోల్ పోషించారు.

డేవిడ్ వార్నర్‌కు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు :
రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ వార్నర్‌ను అవమానించే వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి నెటిజన్లు నటుడిని విమర్శించారు. సోషల్ మీడియాలో రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే రాజేంద్ర ప్రసాద్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

అసలు ఏమన్నారంటే? :
ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల, హీరో నితిన్‌ క‌లిసి డేవిడ్ వార్నర్‌ను పట్టుకొచ్చారు. క్రికెట్ ఆడమంటే పుష్ప సిగ్నేచర్ స్టెప్పులు వేస్తున్నాడు. వీడు మాములోడు కాదండి. రేయ్.. వార్నర్ నీకు ఇదే నా వార్నింగ్ అంటూ వ్యాఖ్యానించారు. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలకు వార్నర్‌కు అర్థం కాక వార్నర్ నవ్వుతూనే ఉన్నాడు. వీడియో వైరల్ కావడంతో వివాదానికి దారితీసింది.

సోషల్ మీడియా వేదికగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. “నాకు డేవిడ్ వార్నర్, అతని క్రికెట్ అంటే చాలా ఇష్టం. డేవిడ్ కూడా మన సినిమాలను ఇష్టపడతాడు. అందుకే ఒకరికొకరు దగ్గరయ్యాం. కానీ, వార్నర్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరుతున్నాను. నాకు తెలియకుండా ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి. అది అనుకోకుండా జరిగినా పొరపాటు మాత్రమే”అని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. %8

The post Rajendra Prasad : ఇకపై అలా జరగదు.. క్రికెటర్ వార్నర్‌కు నటుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు.. వీడియో! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Keerthy Suresh : నా భర్త ఎలాంటి వాడంటే? ఒక్క మాటలో అసలు నిజాన్ని బయటపెట్టేసిన కీర్తి సురేశ్..! https://tufan9.com/entertainment-news/keerthi-suresh-comments-about-her-husband-in-telugu.html Fri, 24 Jan 2025 17:52:14 +0000 https://tufan9.com/?p=38777 Keerthy Suresh : తెలుగుసినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. ఆమె నటించింది తక్కువ సినిమాలే. అయినా మంచి సినిమాలు ఆమె ఖాతాలో పడ్డాయి. దాంతో ఒక్కసారిగా కీర్తి సురేష్ గ్రాఫ్ పెరిగిపోయింది. అప్పట్లో బేబీ జాన్ మూవీతో కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీలో లక్ పరీక్షించుకుంది. కానీ, ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఇటీవలే పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ తన వ్యక్తిగత జీవితం గురించి అనేక […]

The post Keerthy Suresh : నా భర్త ఎలాంటి వాడంటే? ఒక్క మాటలో అసలు నిజాన్ని బయటపెట్టేసిన కీర్తి సురేశ్..! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Keerthy Suresh : తెలుగుసినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. ఆమె నటించింది తక్కువ సినిమాలే. అయినా మంచి సినిమాలు ఆమె ఖాతాలో పడ్డాయి. దాంతో ఒక్కసారిగా కీర్తి సురేష్ గ్రాఫ్ పెరిగిపోయింది. అప్పట్లో బేబీ జాన్ మూవీతో కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీలో లక్ పరీక్షించుకుంది. కానీ, ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఇటీవలే పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ తన వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలను వెల్లడించింది. ఇప్పుడు కీర్తి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ప్రధానంగా తన భర్త వ్యక్తిత్వం గురించి పొగడ్తలతో ముంచెత్తుతోంది కీర్తి.

ఇంతకీ ఆ విషయాలు ఏంటో మనం ఓసారి చూద్దాం.. తన భర్త గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఆమె బయటపెట్టారు. ముఖ్యంగా తన భర్త మనస్తత్వం సిగ్గుపడే మనస్తత్వమని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. తన భర్త ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ప్రైవేట్‌‌లో ఉంటుందని, తన భర్త మీడియాకు దూరంగా ఉండేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారంటూ కీర్తి సురేష్ తెలిపింది. తామిద్దరం ఏ ప్రాంతానికి వెళ్లినా ఫోటోలు, వీడియోలు తీస్తుండటంతో తన భర్త కొద్దిగా ఇబ్బంది పడుతున్నారని కీర్తి సురేష్ చెబుతోంది. ఇప్పుడా ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Keerthy Suresh : భర్త గురించి అసలు సీక్రెట్ చెప్పిన కీర్తి సురేష్

ఇంతకీ కీర్తి సురేష్ తన భర్త పేరు ఏంటో చెప్పలేదు కదా… ఆయన పేరు.. ఆంటోని థట్టిల్. ఈ క్యూట్ కపుల్ జోడీ ఎంతో చూడముచ్చటగా ఉందని నెటిజన్లు అంటున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కీర్తి సురేష్ ఎంతో ట్రెడిషనల్ కనిపించేందుకు ఇష్టపడుతుంది. మీడియా ముందుకు వచ్చినప్పుడు లేదా ఏదైనా ఈవెంట్ కు వెళ్లిన సమయంలో కూడా మెడలో తాళితోనే కనిపించింది. కీర్తి సురేష్‌కు భర్త ఆంటోని చిరకాల మిత్రుడు కూడా. ఇటీవల పెళ్లి తర్వాత కూడా కీర్తి సురేష్ తన బోల్డ్ ఫొటోలను షేర్ చేయడంతో బాగా వైరల్ అవుతున్నాయి.

కెరీర్ విషయానికి వస్తే.. కీర్తి సురేష్ బ్యాక్ టు బ్యాక్ మూవీలతో ఆమె కెరీర్ దూసుకెళ్తోంది. తెలుగులో కీర్తి సురేష్ బాగా బిజీ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆమెకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోవడంతో కీర్తి సురేశ్ అభిమానించే అభిమానుల సంఖ్య అలానే పెరుగుతువస్తున్నారు. కీర్తి సురేష్ మరిన్ని స్టార్ హీరోల మూవీల్లో నటించాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.

Read Also : Virender Sehwag : వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి విడాకులు..? ఇందులో నిజమెంత? 20ఏళ్ల కాపురానికి వీడ్కోలు పలకనున్నారా?

The post Keerthy Suresh : నా భర్త ఎలాంటి వాడంటే? ఒక్క మాటలో అసలు నిజాన్ని బయటపెట్టేసిన కీర్తి సురేశ్..! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Tollywood Actress : భర్త ఫొటోలు డిలీట్ చేసిన తెలుగు హీరోయిన్.. విడాకుల తీసుకోబోతుందా ఏంటి? ఆమె ఎవరంటే? https://tufan9.com/entertainment-news/colours-swathi-deletes-husband-photos-from-account-hints-divorce-rumors.html Thu, 23 Jan 2025 18:38:53 +0000 https://tufan9.com/?p=38760 Colours Swathi : ప్రస్తుత రోజుల్లో సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకునేవారి సంఖ్య పెరిగిపోతోంది. సెలబ్రిటీల కాపురాలు నీటి మీద బుడగలా మారిపోతున్నాయి. ఇందులో చాలావరకూ తమ వివాహ బంధానికి సంబంధించి అధికారికంగా బయటపెట్టడం లేదు.. కానీ, గుట్టుగా తమ రిలేషన్‌పిప్ గురించి దాచేస్తున్నారు. మరికొందరు బ్రేకప్ విషయాన్ని హింట్ ఇస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్లలో తమ భాగస్వామితో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలను డిలీట్ చేయడం ద్వారా హింట్ చేస్తున్నారు. చివరికి విడాకులంటూ సడన్ షాక్ […]

The post Tollywood Actress : భర్త ఫొటోలు డిలీట్ చేసిన తెలుగు హీరోయిన్.. విడాకుల తీసుకోబోతుందా ఏంటి? ఆమె ఎవరంటే? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Colours Swathi : ప్రస్తుత రోజుల్లో సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకునేవారి సంఖ్య పెరిగిపోతోంది. సెలబ్రిటీల కాపురాలు నీటి మీద బుడగలా మారిపోతున్నాయి. ఇందులో చాలావరకూ తమ వివాహ బంధానికి సంబంధించి అధికారికంగా బయటపెట్టడం లేదు.. కానీ, గుట్టుగా తమ రిలేషన్‌పిప్ గురించి దాచేస్తున్నారు. మరికొందరు బ్రేకప్ విషయాన్ని హింట్ ఇస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్లలో తమ భాగస్వామితో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలను డిలీట్ చేయడం ద్వారా హింట్ చేస్తున్నారు. చివరికి విడాకులంటూ సడన్ షాక్ ఇస్తున్నారు.

లేటెస్టుగా మరో నటి కూడా విడాకులు తీసుకోబోతున్నట్టుగా హింట్ ఇచ్చింది. ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో కాదు.. కలర్స్ స్వాతి (Colours Swathi). అప్పట్లో కెరీర్ బాగా పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు పెళ్లితో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. కలర్స్ ప్రొగ్రామ్‌తో బాగా ఫేమస్ అయిన కలర్స్ స్వాతి.. డేంజర్, అష్టాచెమ్మా మూవీల్లో నటించి హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

విక్టరీ వెంకటేష్ మూవీ ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ మూవీలో త్రిష చెల్లెలిగా నటించి మెప్పించింది. హీరో నిఖిల్ మూవీల్లో కార్తికేయ, స్వామి రారా, త్రిపుర, గోల్కొండ హైస్కూల్ , లండన్ బాబు మూవీల్లో కూడా నటించి తనదైన నటనతో ఆకట్టుకుంది. కారణాలు ఏదైనా కావొచ్చు.. ఇటీవల డివోర్స్ తీసుకునే వారు ఎక్కువగానే ఉన్నారు.

Colours Swathi : పైలట్ వికాస్ వాసును పెళ్లాడిన కలర్స్ స్వాతి :

సినీ కెరీర్ మంచి పీక్స్‌‌లో ఉన్న సమయంలోనే కేరళకు చెందిన పైలట్ వికాస్ వాసును 2018లో కలర్స్ స్వాతి వివాహం అయింది. పెళ్లైన తర్వాత కొన్ని సంవత్సరాలకు ఇరువురి మధ్య గొడవలు, మనస్పర్థలు వచ్చినట్టుగా జోరుగా ప్రచారం జరిగింది. 2023లో వచ్చిన మంత్ ఆఫ్ మధు మూవీ ప్రమోషన్స్ సందర్భంగా తన భర్త విషయం అడిగితే స్వాతి చెప్పనని స్పష్టం చేసింది. మరోసారి స్వాతి విడాకుల గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.

దీనిక కారణం.. ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లలో పెళ్లి ఫొటోలతో పాటు భర్తకు సంబంధించిన ఫోటోలన్నింటినీ డిలీట్ చేసేసింది. దీంతో స్వాతి ఇన్‌డైరెక్టుగా విడాకులపై హింట్ ఇచ్చేసిందని అంటున్నారు. మరి ఇది నిజమో? అబద్ధమో తెలియాలంటే స్వాతి లేదా ఆమె భర్తయినా నోరు విప్పాలి. ఇన్నాళ్లకు కలర్స్ స్వాతి విడాకుల విషయంలో మరోసారి సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. తన సోషల్ అకౌంట్‌లో భర్తతో దిగిన పెళ్లి ఫోటోలన్నింటినీ స్వాతి డిలీట్ చేయడంతో ఈ పుకార్లకు మరింత బలానిచ్చింది. అయితే, స్వాతి తన భర్తతో విడిపోయినట్టుగా ఇలా హింట్ ఇచ్చి ఉంటుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Read Also : Airtel Jio : జియో, ఎయిర్‌టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. ఇకపై మొబైల్ డేటాకు డబ్బులు కట్టనక్కర్లేదు..!

The post Tollywood Actress : భర్త ఫొటోలు డిలీట్ చేసిన తెలుగు హీరోయిన్.. విడాకుల తీసుకోబోతుందా ఏంటి? ఆమె ఎవరంటే? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Ram Gopal Varma : చెక్ బౌన్స్ కేసు.. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష..! https://tufan9.com/entertainment-news/ram-gopal-varma-convicted-in-cheque-bounce-case.html Thu, 23 Jan 2025 06:06:39 +0000 https://tufan9.com/?p=38747 Ram Gopal Varma : ప్రముఖ సినీదర్శకుడు రామ్ గోపాల్ వర్మకు షాక్ తగింది. లేటెస్ట్ వెంచర్ “సిండికేట్” ప్రకటించే ఒక రోజు ముందు ముంబైలోని కోర్టు చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీకి 3 నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్ కేసులో అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసుపై గత ఏడేళ్లుగా విచారణ జరుగుతోంది. అయితే వర్మ కోర్టుకు గైర్హాజరయ్యాడు. దీంతో రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ కోసం స్టాండింగ్ […]

The post Ram Gopal Varma : చెక్ బౌన్స్ కేసు.. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష..! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Ram Gopal Varma : ప్రముఖ సినీదర్శకుడు రామ్ గోపాల్ వర్మకు షాక్ తగింది. లేటెస్ట్ వెంచర్ “సిండికేట్” ప్రకటించే ఒక రోజు ముందు ముంబైలోని కోర్టు చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీకి 3 నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్ కేసులో అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసుపై గత ఏడేళ్లుగా విచారణ జరుగుతోంది. అయితే వర్మ కోర్టుకు గైర్హాజరయ్యాడు.

దీంతో రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ కోసం స్టాండింగ్ నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేయాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 138 ప్రకారం వర్మను దోషిగా నిర్ధారించారు. మూడు నెలల్లోగా ఫిర్యాదుదారుడికి రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని, లేదంటే మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని వర్మను కోర్టు ఆదేశించింది.

Ram Gopal Varma : చెక్ బౌన్స్ కేసు ఏంటి? :

2018లో మహేష్‌చంద్ర మిశ్రా అనే వ్యక్తి రామ్‌గోపాల్ వర్మపై చెక్ బౌన్స్ కేసులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీ అనే కంపెనీ చెక్ బౌన్స్ కేసును వేసింది. ఈ కేసు వర్మ సంస్థపై ఉంది.
సత్య , రంగీలా, కంపెనీ, సర్కార్ వంటి చిత్రాలతో విజయాన్ని రుచి చూసిన వర్మ ఇటీవలి సంవత్సరాలలో తనదైన ముద్ర వేయడంలో విఫలమయ్యారు.

ముఖ్యంగా కోవిడ్ -19 మహమ్మారి సమయంలో తన ఆఫీసును అమ్ముకోవాల్సిన సమయంలో ఆర్థికంగా చితికిపోయారు. ఈ ప్రత్యేక కేసులో, జూన్ 2022లో, పీఆర్, రూ. 5,000 నగదు భద్రతను అమలు చేయడంపై కోర్టు బెయిల్‌పై విడుదలయ్యాడు. కోర్టు పరిశీలనలతో కూడిన వివరణాత్మక తీర్పు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది.

Read Also : Abhishek Sharma : 8 సిక్సర్లతో అద్భుత అర్ధ సెంచరీ.. గురు యువరాజ్ సింగ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ..!

The post Ram Gopal Varma : చెక్ బౌన్స్ కేసు.. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష..! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Kiran Abbavaram : తండ్రి కాబోతున్న తెలుగు హీరో.. కిరణ్ అబ్బవరం, రహస్య బేబీబంప్ ఫొటోలు వైరల్..! https://tufan9.com/entertainment-news/kiran-abbavaram-first-child.html Tue, 21 Jan 2025 05:49:04 +0000 https://tufan9.com/?p=38713 Kiran Abbavaram : యువ నటులు రహస్య, కిరణ్ అబ్బవరం తల్లిదండ్రులు కాబోతున్నారు. తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు.

The post Kiran Abbavaram : తండ్రి కాబోతున్న తెలుగు హీరో.. కిరణ్ అబ్బవరం, రహస్య బేబీబంప్ ఫొటోలు వైరల్..! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Kiran Abbavaram And Rahasya expecting first child : సెలబ్రిటీ కపుల్, టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, రహస్య తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ సంతోషకరమైన విషయాన్ని కిరణ్ అబ్బవరం తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. రహస్య బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. తన భార్యను వెనుక నుంచి ఆలింగనం చేసుకుని, ఆమె బేబీ బంప్‌ను పట్టుకుని ఉన్న ఫోటోను హీరో కిరణ్ అబ్బవరం షేర్ చేశాడు. తమ బిడ్డ కడుపులో పెరుగుతోందని పోస్టులో రాసుకొచ్చాడు. ‘మా ప్రేమ 2 అడుగుల మేర పెరుగుతోంది’ అని కిరణ్ ఫొటో క్యాప్షన్ ఇచ్చాడు. ఈ జంట ఫొటోలకు పలువురు నెటిజన్లు కంగ్రెట్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కిరణ్ అబ్బవరం, రహస్య తమ మొదటి మూవీ రాజా వారు రాణి గారులో కలిసి నటించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం పెరిగి వెంటనే కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ డేటింగ్ ప్రారంభించారు. కొన్నాళ్ల పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత, 2023 ఆగస్టులో కర్ణాటకలో జరిగిన వేడుకలో వివాహం చేసుకున్నారు. కిరణ్ అబ్బవరం ఇటీవలే “కా” మూవీతో హిట్ కొట్టాడు. అతని కొత్త చిత్రం “దిల్రూబా” ప్రేమికుల రోజున విడుదల కానుంది.

Kiran Abbavaram : రహస్య గోరక్‌‌తో ప్రేమ, పెళ్లి..

ఏపీలోని రాయచోటికి చెందిన కిరణ్ అబ్బవరం సినీ ఇండస్ట్రీలోకి రాకముందు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్‌ చేసేవాడు. 2019లో రాజా వారు రాణి గారు మూవీతో సినిమాల్లోకి వచ్చాడు. ఎస్సార్ కల్యాణ్ మండపం మూవీతో కిరణ్ అబ్బవరంకు మంచి గుర్తింపు వచ్చింది.

Kiran Abbavaram and Rahasya expecting first child
Kiran Abbavaram and Rahasya expecting first child

ఆపై, నేను మీకు కావాల్సినవాడిని, సమ్మతమే, వినరో భాగ్యము విష్ణుకథ, సెబాస్టియన్ పీసీ 524, మీటర్, రూల్స్ రంజన్, క మూవీల్లో నటించి సినీప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. రాజా వారు రాణి గారు మూవీలో నటించిన రహస్య గోరక్‌‌తో కిరణ్ పరిచయం కాస్తా ప్రేమగా మారి అది పెళ్లీపీటలకు వెళ్లింది. కుటుంబం, బంధువుల సమక్షంలో కిరణ్, రహస్య పెళ్లి జరిగింది.

దీపావళికి వచ్చిన కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ మంచి హిట్ టాక్ అందుకుంది. దాదాపు రూ. 50కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ‘దిల్ రుబా’ అనే మూవీలో కిరణ్ నటిస్తున్నాడు. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. విశ్వ కరుణ్ దర్శకత్వంలో జోజో జోస్, రవి, సారెగమ రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ రిలీజ్ అయింది. ఈ మూవీని ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజున విడుదల కానుంది.

Read Also : Paneer Mughalai Dum Biryani : నోరూరించే పన్నీర్ ముఘలాయ్ ధమ్ బిర్యాని.. ఇలా చేశారంటే చికెన్ బిర్యానీ కన్నా టేస్ట్ అదిరిపొద్ది..!

The post Kiran Abbavaram : తండ్రి కాబోతున్న తెలుగు హీరో.. కిరణ్ అబ్బవరం, రహస్య బేబీబంప్ ఫొటోలు వైరల్..! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Senior Actress : కోట్ల ఆస్తిని పేద విద్యార్థులకు ఇచ్చేసిన ప్రముఖ సినీనటి ఎవరంటే? https://tufan9.com/entertainment-news/senior-actress-srividya-donated-her-property-to-poor-students-in-telugu.html Thu, 10 Oct 2024 08:15:31 +0000 https://tufan9.com/?p=38145 Senior Actress : వెండితెరపై ఎందరో బాలనటులుగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రముఖ నటులుగా రాణించారు. సినిమా పరిశ్రమలో నిలబడాలంటే టాలెంట్ మాత్రమే కాదు.. అదృష్టం కూడా ఉండాలంటారు. ఏదైనా ఒక మూవీలో అవకాశం వస్తే.. సెలబ్రిటీ అయిపోవచ్చని చాలా మంది అనుకుంటారు. సినిమా ప్రపంచం అనుకున్నంత ఈజీగా ఉండదు. కొంతమంది నటీనటుల జీవితాల్లో ఎన్నో బాధాకరమైనవి ఉంటాయి. అనేక మంది పెద్ద స్టార్స్ ఆమెతో కలిసి పనిచేయాలని ఆసక్త చూపేవారు. కానీ, విధి అనుకోని […]

The post Senior Actress : కోట్ల ఆస్తిని పేద విద్యార్థులకు ఇచ్చేసిన ప్రముఖ సినీనటి ఎవరంటే? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Senior Actress : వెండితెరపై ఎందరో బాలనటులుగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రముఖ నటులుగా రాణించారు. సినిమా పరిశ్రమలో నిలబడాలంటే టాలెంట్ మాత్రమే కాదు.. అదృష్టం కూడా ఉండాలంటారు. ఏదైనా ఒక మూవీలో అవకాశం వస్తే.. సెలబ్రిటీ అయిపోవచ్చని చాలా మంది అనుకుంటారు.

సినిమా ప్రపంచం అనుకున్నంత ఈజీగా ఉండదు. కొంతమంది నటీనటుల జీవితాల్లో ఎన్నో బాధాకరమైనవి ఉంటాయి. అనేక మంది పెద్ద స్టార్స్ ఆమెతో కలిసి పనిచేయాలని ఆసక్త చూపేవారు. కానీ, విధి అనుకోని విధంగా ఆమె జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ ప్రముఖ నటి ఎవరు? ఆమె జీవితంలో బయటకు తెలియని వాస్తవాలేంటి? అలాంటి మహానటుల్లో సీనియర్ ప్రముఖ నటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

14ఏళ్లకే సినీ ప్రపంచంలోకి.. :
ఆమె మరెవరో కాదు ప్రముఖ హాస్యనటుడు కృష్ణమూర్తి, ఎంఎల్ వసంత కుమారి కుమార్తె శ్రీవిద్య. ఈమె పుట్టిన ఏడాదికే శ్రీవిద్య తండ్రి కృష్ణమూర్తి ప్రమాదం జరిగింది. దాంతో ఆయన అనారోగ్యం పాలయ్యారు. ఆ
తరువాత, కుటుంబ బాధ్యత మొత్తం ఆమె తల్లి ఎంఎల్ వసంతపైనే పడింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా శ్రీవిద్య 14 ఏళ్లకే సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. నటుడు శివాజీ గణేశన్ సరసన ‘తిరువరుట్చెల్వన్’
మూవీతో శ్రీవిద్య తమిళ పరిశమ్రలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘పెట్టరాసి పెట్టమ్మ’ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి కూడా అడుగుపెట్టింది. అద్భుతమైన నటన, నృత్యం, ఆకర్షణీయమైన అందంతో ఆమెకు చాలా
అవకాశాలు వచ్చాయి. దర్శకుడు దాసరి నారాయణరావు ప్రోత్సాహంతో మరిన్ని సినిమాల్లో శ్రీవిద్య నటించి మెప్పించారు.

Senior Actress Srividya : కమల్ హాసన్‌తో ప్రేమాయణం :

రజనీకాంత్, కమల్ హాసన్‌లతో కలిసి బాలచందర్ మూవీ ‘అపూర్వ రాగంగల్’లో శ్రీవిద్య నటించారు. ఈ మూవీ భారీ విజయం సాధించి తెలుగులో కూడా రీమేక్ అయింది. రెండు భాషల్లోనూ శ్రీవిద్య కీలక పాత్ర
పోషించింది. అప్పట్లో శ్రీవిద్య, కమల్ హాసన్ కలిసి చాలా సినిమాల్లో నటించారు. రీల్ లైఫ్‌తో పాటు, రియల్ లైఫ్‌లో కూడా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కానీ, శ్రీవిద్య తల్లి వారి పెళ్లికి అంగీకరించలేదు.

Senior Actress Srividya Donated Her Property to Poor Students
Senior Actress Srividya

దర్శకుడు జార్జ్‌ను పెళ్లాడిన శ్రీవిద్య :
ఆ తర్వాత శ్రీవిద్య మలయాళ దర్శకుడు జార్జ్ థామస్‌తో పరిచయం ఏర్పడింది. నటి జార్జ్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ, ఆయన మత మార్పిడికి షరతు పెట్టాడు. కుటుంబం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది.
కానీ, శ్రీవిద్య అంగీకరించలేదు. ఆమె తన మతాన్ని మార్చుకుంది. 1978లో జార్జ్‌ని వివాహం చేసుకుంది. వివాహానంతరం భర్త కోరిక మేరకు సినీ కెరీర్‌కు దూరంగా ఉంటూ వచ్చింది. అయితే, పెళ్లయ్యాక ఆవహ
జీవితంలో గందరగోళం నెలకొంది. జార్జ్ తన ఆస్తిని స్వాధీనం చేసుకున్నాడు. ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. శ్రీవిద్య 1980లో జార్జ్‌తో విడాకులు తీసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మళ్లీ సినిమాల్లోకి
రావాల్సి వచ్చింది.

సంపద మొత్తాన్ని పేద విద్యార్థులకు దానంగా :
తన ఆస్తిని తిరిగి ఇప్పించాలని హైకోర్టు వరకు పోరాడింది. ఆ తరువాత, శ్రీవిద్య రీఎంట్రీతో తన సినీ కెరీర్ ప్రారంభించింది. తమిళం, తెలుగు, మలయాళ చిత్రాలలో క్యారెక్టర్ రోల్స్ చేసింది. కానీ, అదృష్టం ఆమెకు
అనుకూలంగా లేదు. 2003లో ఆమెకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. తన జీవితంలో చివరి రోజుల్లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. తాను కూడబెట్టిన సంపదను సంగీత, నృత్య కళాశాలలోని
పేద విద్యార్థులకు సాయంగా అందించింది. నటుడు గణేష్ సాయంతో కూడా ఆమె ఒక ట్రస్ట్ స్థాపించారు. 2006లో 19న అక్టోబర్ శ్రీవిద్య మరణించారు.

Read Also : Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…

The post Senior Actress : కోట్ల ఆస్తిని పేద విద్యార్థులకు ఇచ్చేసిన ప్రముఖ సినీనటి ఎవరంటే? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Actor Ali Comments : నా వల్ల పది కుటుంబాలకు సాయం అందినా చాలు : ప్రముఖ నటుడు అలీ https://tufan9.com/latest-telugu-news/actor-ali-comments-want-help-who-need-help-talented-peoples-in-india-says-actor-ali.html Tue, 28 Feb 2023 16:07:22 +0000 https://tufan9.com/?p=37048 Actor Ali Comments : ప్రముఖ నటుడు ఆంధ్రప్రదేశ్‌ సమాచారశాఖ ముఖ్య సలహాదారు అలీ మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

The post Actor Ali Comments : నా వల్ల పది కుటుంబాలకు సాయం అందినా చాలు : ప్రముఖ నటుడు అలీ appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Actor Ali Comments : ప్రముఖ నటుడు ఆంధ్రప్రదేశ్‌ సమాచారశాఖ ముఖ్య సలహాదారు అలీ మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ–‘‘ గతేడాది ఓ కార్యక్రమంకోసం గెస్ట్‌గా పిలిస్తే ఆస్ట్రేలియా వెళ్లాను. అక్కడ ఉన్న మన తెలుగువారందరూ ఒకేమాట మీద ఉంటూ ఎంతోమందికి సాయం చేయటం నా కళ్లారా చూశాను. ఆరోజు అక్కడున్న మన తెలుగువారు విష్ణురెడ్డి, శశి కొలికొండను పిలిచి అడిగాను.

మీరు ఆస్ట్రేలియాలో ఉండి ఇంతమంచి చేస్తున్నారు కదా, అదేమంచి మన తెలుగువారికి కూడా చేయొచ్చు కదా అని అడిగాను. శశిగారు, విష్ణు జగ్గిరెడ్డి గారు రేపు కలుద్దాం అలీగారు అన్నారు. నేను ఇద్దరో ముగ్గురో వస్తారని అనుకున్నాను. దాదాపు 60మందికి పైగా వచ్చి ఎలా సాయం చేయాలి అని అడిగారు. ఆరోజు నేను కొన్ని సలహాలు సూచనలు ఇవ్వటంతో అందరూ సరే అన్నారు. కట్‌ చేస్తే 9 నెలల తర్వాత ఆర్వేన్సిస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీఇవో శశిగారు ఆర్వేన్సిస్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌కి సంబంధించిన ఆస్ట్రేలియన్‌ బ్రూస్‌ మ్యాన్‌ఫీల్డ్‌ ( డైరెక్టర్‌– గవర్నర్‌ అండ్‌ కంప్లేయిన్స్‌) ఇండియాకు తీసుకుని వచ్చారు.

actor-ali-comments-want-help-who-need-help-talented-peoples-in-india-says-actor-ali
actor ali comments

ఆ కంపెనీవారు బాగా చదువుకుని టాలెంట్‌ ఉండి డబ్బుల్లేక ఇబ్బంది పడే ఎంతోమందికి సాయం చేయటానికి ఇక్కడకి వచ్చారు. నన్ను నమ్మి అవసరంలో ఉన్న వారికి సాయం అందించే ఉద్ధేశ్యంతో ఇంతదూరం వీరంత ఇండియాకి వచ్చారు. నావల్ల ఒక పది కుటుంబాలకి మంచి జరిగిన ఫరవాలేదనిపించింది. అందుకే ఆర్వేన్సిస్‌ కంపెనీకి ఇండియా బ్రాండ్‌ అంబాసిడర్‌లా పని చేయటానికి మీ ముందుకు వచ్చాను’’ అన్నారు. ఆర్వేన్సిస్‌ సీఈవో డైరెక్టర్‌ శశిధర్‌ కొలికొండ మాట్లాడుతూ– ‘‘ హైదరాబాద్‌ నుండి ఆస్ట్రేలియా సిటిజన్‌ అయ్యి అక్కడినుండి మా ఆపరేషన్స్‌ను నిర్వహిస్తున్నాను. అలీ గారు కలసిన తర్వాత నా మైండ్‌సెట్‌ అంతా మారిపోయింది.

అందుకే, మేము ఆస్ట్రేలియాలో చేసే సేవలను ఇండియాలో చేయాలి అని నిర్ణయించుకుని చాలా పెద్ద ఎత్తున మనవాళ్లకు విద్య– వైద్య– టెక్నాలజీ రంగాల్లో ఎవరికి ఏ అవసరం ఉంటే ఆ అవసరాన్ని తీర్చాలని మా టీమంతా కంకణం కట్టుకుని పనిచేస్తున్నాం. అందుకే మా టీమంతా కలిసి వైజాగ్‌లో మార్చి 3–4 తారీకుల్లో ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఏర్పాటు చేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్‌ బిజినెస్‌ సమ్మిట్‌కు హాజరవుతున్నాం ’’ అన్నారు. బ్రూస్‌ మ్యాన్‌ఫీల్డ్‌ మాట్లాడుతూ–‘‘ అలీ లాంటి మంచి వ్యక్తి మాకు, మా కంపెనీకి అండగా నిలబడటం ఎంతో ఆనందంగా ఉంది. ఎన్నో వేత కుటుంబాలకు మా సేవలను అందిస్తాం’’ అన్నారు. ఇండియాలో మా కంపెనీ సాయం కోరి వచ్చిన అర్హులకు సాయం చేయటానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆర్వేన్సిస్‌ హెడ్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ సుకన్య కంభంపాటి తెలిపారు.

The post Actor Ali Comments : నా వల్ల పది కుటుంబాలకు సాయం అందినా చాలు : ప్రముఖ నటుడు అలీ appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Samantha : హీరోయిన్‌గానే కాదు.. స్కూళ్లోనూ సమంత టాపరే.. సామ్ టెన్త్ క్లాస్ మెమో ఇదే..! https://tufan9.com/trending-news/samantha-actress-samantha-shares-10th-class-marks-sheet-photo-goes-viral.html Tue, 21 Feb 2023 03:45:53 +0000 https://tufan9.com/?p=25696 samantha : సమంత ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి దగ్గరైంది. తన అందంతో పాటు నటనలోనూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఎక్కువ సినిమాలు ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కొత్త హీరోయిన్లకు గట్టిపోటీ ఇస్తూ తన సత్తాను చాటుకుంటుంది. సాధారణంగా ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్లు చదువు మీద అంత ఆసక్తి చూపరని .. వాళ్లకి చదువు మీద పెద్దగా […]

The post Samantha : హీరోయిన్‌గానే కాదు.. స్కూళ్లోనూ సమంత టాపరే.. సామ్ టెన్త్ క్లాస్ మెమో ఇదే..! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
samantha : సమంత ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి దగ్గరైంది. తన అందంతో పాటు నటనలోనూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఎక్కువ సినిమాలు ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కొత్త హీరోయిన్లకు గట్టిపోటీ ఇస్తూ తన సత్తాను చాటుకుంటుంది. సాధారణంగా ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్లు చదువు మీద అంత ఆసక్తి చూపరని .. వాళ్లకి చదువు మీద పెద్దగా ఇష్టం ఉండదని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

Actress Samantha Shares 10th Class Marks Sheet, Photo Goes Viral
Actress Samantha Shares 10th Class Marks Sheet, Photo Goes Viral

ఇకపోతే సమంత చాలా తెలివైనదని చదువులో చాలా టాలెంటెడ్ అని తెలుస్తోంది. అయితే సమంత పదో తరగతి సోషల్ మీడియాలో అయ్యాయి. ఇక తాను పదో తరగతి సెయింట్ స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూల్ లో చదివారు. ఈ క్రమంలోనే తన మార్కుల జాబితా వైరల్ కాగా హాఫ్ ఇయర్లీ పరీక్షలలో 1000 మార్కులకుగాను సమంతాకు 887 మార్కులు వచ్చాయి.

ఇక ఫిజిక్స్ లో వందకు 95 మార్కులు, అలాగే గణితంలో ఏకంగా100 కు 100 మార్కులు వచ్చాయి. సమంత మార్కుల జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఇక స్కూల్ సంబంధించిన ప్రోగ్రెస్ లో సమంత గురించి స్కూల్ టీచర్లు సమంత లో ప్రశంసిస్తూ రాశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సమంత మార్పులు చూసి అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Read Also : Samantha Ruth Prabhu : డబుల్ రేటు పెట్టి మరి.. ఆ ఇంటినే సమంత ఎందుకు కొనేసింది.. సామ్ సెంటిమెంట్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

The post Samantha : హీరోయిన్‌గానే కాదు.. స్కూళ్లోనూ సమంత టాపరే.. సామ్ టెన్త్ క్లాస్ మెమో ఇదే..! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Dhanush SIR Movie Review : ధనుష్ ‘సార్’ మూవీ రివ్యూ.. లెక్కల మాస్టారుగా ఇరగదీశాడు..! https://tufan9.com/latest-telugu-news/dhanush-sir-movie-review-and-rating-with-live-updates-on-feb-17-released.html Fri, 17 Feb 2023 04:07:30 +0000 https://tufan9.com/?p=36852 Dhanush SIR Movie Review : తమిళ హీరో ధ‌నుష్‌‌కు విలక్షణ నటుడిగా పేరొంది. ఒక్క త‌మిళంలోనే కాదు.. తెలుగులోనూ ధనుష్‌ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. అందుకే ఈసారి ధనుష్ మొదటిసారిగా ‘సార్’ అంటూ కొత్త మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో ‘వాత్తి’ పేరుతో ఈ మూవీ రిలీజ్ అయింది. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో సూర్య దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య చిత్రాన్ని నిర్మించారు. విద్య‌ను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ కాలేజీల‌పై ఒక […]

The post Dhanush SIR Movie Review : ధనుష్ ‘సార్’ మూవీ రివ్యూ.. లెక్కల మాస్టారుగా ఇరగదీశాడు..! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Dhanush SIR Movie Review : తమిళ హీరో ధ‌నుష్‌‌కు విలక్షణ నటుడిగా పేరొంది. ఒక్క త‌మిళంలోనే కాదు.. తెలుగులోనూ ధనుష్‌ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. అందుకే ఈసారి ధనుష్ మొదటిసారిగా ‘సార్’ అంటూ కొత్త మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో ‘వాత్తి’ పేరుతో ఈ మూవీ రిలీజ్ అయింది. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో సూర్య దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య చిత్రాన్ని నిర్మించారు. విద్య‌ను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ కాలేజీల‌పై ఒక యువ‌కుడు చేసిన పోరాటమే ‘సార్‌’ మూవీ.. ఈ మూవీలో ధ‌నుష్‌, వెంకీ అట్లూరి ఏం చెప్పదలుచుకున్నారు అనేది తెలియాలంటే వెంటనే స్టోరీలోకి వెళ్లిపోదాం..

స్టోరీ :
సార్ మూవీ విద్యావ్యవస్థలో లోపాలను ఎత్తి చూపే కథాశంతో తెరకెక్కింది. ఈ మూవీ ఫిబ్రవరి 17న భారీగా థియేటర్లలో రిలీజ్ అయింది. సినిమా కథ విషయానికి వస్తే.. క‌డ‌ప జిల్లా క‌లెక్ట‌ర్ మూర్తి (సుమంత్‌) విద్యార్థులను కలిసేందుకు వెళ్తాడు. అక్కడ తమ గురువు బాల‌గంగాధర తిల‌క్ అలియాస్ బాలు (ధ‌నుష్‌) గురించి విద్యార్థులు గొప్పగా చెప్ప‌టంతో మొదలవుతుంది. 1993లో ప్రైవేటు కాలేజీల హ‌వా నడిచే రోజులివి.. ప్రైవేటు కాలేజీల్లో చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూస్తుంటారు. అప్పట్లో ప్ర‌భుత్వ కాలేజీల్లో స‌రైన టీచ‌ర్లు ఉండకపోవడమే కారణం.

Dhanush SIR Movie Review : లెక్కల మాస్టారుగా ధనుష్ ప్రేక్షకుల మనసులను గెలిచారా? 

త్రిపాఠి జూనియ‌ర్ కాలేజీలో జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్‌గా ఉన్న ధనుష్.. సిరిపురంలోని ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీకి మ్యాథ్స్ టీచ‌ర్‌గా వస్తాడు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ లెక్చ‌ర‌ర్స్ కూడా వ‌స్తారు. బ‌యాల‌జీ లెక్చరర్‌గా మీనాక్షి (సంయుక్తా మీన‌న్‌) వర్క్ చేస్తుంటుంది. ఆ కాలేజీలోని విద్యార్థుల త‌ల్లిదండ్రులు తమ పిల్ల‌లను చ‌దువు కన్నా ప‌నికి పంపడమే మంచిదని భావిస్తుంటారు. ఆ సమయంలో బాలు విద్యార్థుల తల్లిదండ్రుల్లో మార్పు తీసుకొస్తాడు. బాలు కారణంగా త్రిపాఠి (స‌ముద్ర ఖ‌ని)కి అనేక స‌మ‌స్య‌లు వస్తాయి. ఆ సయమంలో బాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు అనేది తెలియాలంటే సినిమా తప్పక చూడండి..

Dhanush-Sir-Review
Dhanush-Sir-Review

జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ రోల్‌లో ధ‌నుష్ అద్భుతంగా నటించాడు. ఫ‌స్టాఫ్‌లో ఎంటర్‌టైన్ గా సాగిన మూవీ సెకండాఫ్‌లో మాత్రం ఎమోష‌న‌ల్ బాగా పండించాడు. ధ‌నుష్ తన న‌ట‌న‌తో అన్నింటిని బాగా బ్యాలెన్స్ చేశాడు. ఎమోష‌న‌ల్ సీన్స్‌లో మాత్రం ధనుష్ పిండేశాడు.. హీరోయిన్ సంయుక్తా మీన‌న్ రోల్ మాత్రం పరిమితి తగినట్టుగా ఉంది. మరో నటుడు సాయి కుమార్ ప్రెసిడెంట్ రోల్ అద్భుతంగా చేశాడు. స‌ముద్ర ఖ‌ని తనదైన శైలిలో నెగటివ్ రోల్ లో మెప్పించారు.

ప్ర‌త్యేక పాత్ర‌లో సుమంత్, హైప‌ర్ ఆది తమ పాత్ర‌ల్లో చ‌క్క‌గా ఒదిగిపోయారు. విద్య అందరి ప్రాథ‌మిక హ‌క్కుగా చూపించే ప్రయత్నం చేశారు ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి. అదే తన కథలో ప్రేక్షకులకు చూపించాలనుకున్నారు. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌గా పాటలు, ఫైట్స్ అందించారు. సెకండాఫ్‌లో ఎమోష‌న‌ల్ సీన్స్ బాగానే పండించాడు. ల‌వ్ ట్రాక్ పెద్దగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. జీవీ ప్ర‌కాష్ మ్యూజిక్, నేపథ్య సంగీతం పర్వాలేదు. మొత్తం మీద ప్రతిఒక్కరూ ఫ్యామిలీతో కలిసి వెళ్లి చూడదగిన సినిమా సార్.. అని చెప్పవచ్చు.

ధనుష్ ‘సార్’ మూవీ రివ్యూ
మూవీ రేటింగ్ : 2.75/5

Read Also : Valentines Night Movie Review : మంచి మెసేజ్ ను ఇచ్చే ‘వాలెంటైన్స్ నైట్’..

The post Dhanush SIR Movie Review : ధనుష్ ‘సార్’ మూవీ రివ్యూ.. లెక్కల మాస్టారుగా ఇరగదీశాడు..! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>