Fire accident in inghore: మధ్య ప్రదేశ్ ఇందోర్ లోని విజయ్ నగర్ లో శనివాం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. స్వర్ణ్ బాగ్ కాలనీలోని ఓ రెండు అంతస్తుల భవనంలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. స్థానికులు మరో తొమ్మిది మందిని రక్షించి ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందని బావిస్తున్నారు. పార్కింగ్ లో ఉంచిన వాహనాలు కూడా దగ్ధం అయ్యాయి. మూడు గంటల పాటు శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చారు అగ్ని మాపక సిబ్బంది.
అయితే మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం శవరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ప్రమాదం జరిగి… ఏడుగురు సజీవ దహనం జరగడం చాలా బాధగా ఉందని తెలిపారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.