Uma Maheswari : ఎన్టీఆర్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎన్టీఆర్ నాలుగవ కుమార్తె కంటమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం చెందారు. దీంతో ఎన్టీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్య సమస్యల కారణంగానే ఆమె ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే కుటుంబ సభ్యులు సమాచారం తెలుసుకొని ఉమామహేశ్వరి ఇంటికి చేరుకుంటున్నారు. ఇక నారా లోకేష్ ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు. ఇక చంద్రబాబు కూడా అక్కడికి వెళ్లనున్నట్లు సమాచారం.
ఉమామహేశ్వరి గారు జూబ్లీహిల్స్ లోని తన సొంత నివాసంలో కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఇక ఈవిడ ఎన్టీఆర్ యొక్క చిన్న కూతురు. ఈమె మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు. ఇక ఈ మధ్యనే ఉమా మహేశ్వరి గారి కూతురు వివాహం జరిగింది. ఇప్పటికే ఈమె మరణ వార్త తెలుసుకుని ఎన్టీఆర్ అభిమానులు విషాదంలో మునిగి పోతున్నారు. ఇక చాలా మంది సినీనటులు ఈ వార్త గురించి తెలుసుకొని ఆమె మృతి పట్ల సంతాపం తెలపడానికి భువనేశ్వరి ఇంటికి చేరుకుంటున్నారు.
ఎన్టీఆర్ కి మొత్తం నలుగురు కుమార్తెలు ఆయన మొదటి కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి ఈమె రాజకీయాల్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక రెండవ కుమార్తె చంద్రబాబు నాయుడు భార్య అయిన భువనేశ్వరి ఇక మూడవ కుమార్తె లోకేశ్వరి, ఇక ఉమామహేశ్వరి ఆయన నాలుగవ కుమార్తె. ఇక ఈమె మరణ వార్త విన్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈమె ఆత్మకు శాంతి చేకూరాలని మనం కూడా కోరుకుందాం.
Read Also : Peacock Pregnancy : మగ నెమలికి కన్నీరు తాగితే ఆడ నెమలికి గర్భం వస్తుందా? ఇదెంత వరకు నిజం?