Minor girl rape : నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జ్యూస్ తాగిస్తాను రమ్మని పిలిచి అత్యాచారం చేశాడో ప్రబుద్ధుడు. అయితే మూడు నెలల క్రితం జీవనోపాధి కోసం జక్రాన్ పల్లి వచ్చారు దంపతులు. ఊరి చివరన గుడిసె వేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే భర్త.. భార్యా బిడ్డను వదిలేసి వెళ్లిపోయాడు. ఏం చేయాలో పాలుపోని బాలిక తల్లి అక్కడే ఉండి కూలీ పనులు చేసుకుంటు కుమార్తెను పెంచుకుంటోంది.
అయితే రోజూ మాదిరిగానే ఈనెల 22వ తేదీన బిడ్డను ఇంట్లో వదిలేసి కూలీ పనులకు వెళ్లింది. విషయం గమనించిన స్థానికుడు నారాయణ పండ్ల రసం ఇప్పిస్తానంటూ బాలికకు ఆశ చూపించాడు. పాపను వెంట పెట్టుకొని కొండ ప్రాంతానికి వెళ్లాడు. అయితే తల్లి ఇంటికి వచ్చే సరికి బిడ్డ లేదు. కూతురు ఏమై పోయిందో అనుకుంటూ వెతికింది. ఈ క్రమంలోనే కుమార్తెపై జరిగిన అఘాయిత్యం గురించి తెలుసుకుంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలికను ఆస్పత్రికి తరలించారు.
Read Also :Electric bike blast : ఎలక్ట్రిక్ బైక్ పేలి వ్యక్తి మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు!