Lovers suicide : ఒకే ప్రాంతంలో పుట్టారు. అక్కడే చదువుకున్నారు. ఒకే చోట ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. అయితే ఎప్పటి నుంచి ఉన్న స్నేహం ప్రేమగా మారింది. చాలా ఏళ్లుగా వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. అయితే ఈ క్రమంలోనే ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి అయింది. అతడి కంటే ఆమె రెండేళ్లు పెద్దది.. అయినా చాటుమాటుగా కలిసి తిరుగుతున్నారు. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో… చాలా గొడవలు జరగాయి. ఇక జీవితాంతం ఇంతేనని బతికి ఎలాగూ కలిసి ఉండలేమని… కనీసం చావులోనైనా ఒకటవుదామనుకున్నారు. ఇంకేం ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా రాజీవ్ నగర్ కు చెందిన వెంకవ్వ, దశరథం, దంపతులకు ముగ్గురు కుమారులు. రెండు కుమారుడు అనారోగ్యంతో గతంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు చిన్న కుమారుడు నామ వేణు గోపాల్(24), ఇదే పట్టణానికి చెందిన మచ్చ పూజ (26) ఇద్దరూ స్థానికంగా గోపాల్ నగర్ లోని ఓ ప్రైవేటు క్లినిక్ రిసిప్షన్ లో పని చేస్తున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తల్లిదండ్రులు ఆమెకు నాలుగేళ్ల క్రితం మేన బావ అజయ్ తో పెళ్లి చేశారు. భర్తతో ఆమె సఖ్యతగా ఉండటం లేదు. అవివాహితుడైన వేణు గోపాల్ తో తరచుగా కలిసి తిరుగుతోంది. వారి మద్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది.
ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 15 నుంచి ఆమె ఇంటికి రోజు మాదిరి తిరిగి రాకపోవడంతో సిరిసిల్ల పోలీసు స్టేషన్ లో భార్య అదృశ్యమైందని… మే 16న భర్త పిర్యాదు చేశారు. విషయం తెలిసి, మనస్తాపానికి గురైన జంట ఐదు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయారు. మూడు రోజుల క్రితం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి అటవీ ప్రాంతంలోని ధర్మారం చౌరస్తా సమీపానికి బైక్ పై వచ్చారు. ఓ చెట్టుకు ఉరేసుకున్నారు. ఆయా కుటుంబాల్లో విషాధం నింపారు. జంట ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ కృష్ణ మూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also : Crime News : ప్రియుడిని భర్త అంటూ అతనితో ఉన్న మహిళ… రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త.. ఏం చేశాడో తెలుసా?