Crime News : ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా స్కూలుకెళ్లే పిల్లలు కూడా ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు. ఈ చెడు అలవాట్లకు బాగా అలవాటు పడ్డాయి వారు మత్తులో దారుణాలకు పాల్పడుతున్నారు. మద్యం తాగడం అందరూ ఒక ఫ్యాషన్ గా భావిస్తున్నారు. కానీ ఆ అలవాటు వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తడమే కాకుండా మత్తులో నేరాలు చేస్తున్నారు. విజయవాడ లో ఇటీవల ఇటువంటి దారుణ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే…నగరంలోని ఉడ్‌పేట వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఉడ్‌పేటకు చెందిన కిట్టు అనే వ్యక్తి ఆదివారం రాత్రి పీకల వరకు మందు తాగి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న కిట్టు విచక్షణారహితంగా అందరిని దూషించటం మొదలుపెట్టాడు. కొడుకుని మందలించిన తండ్రి రమేష్ మీద కూడా కిట్టు దాడికి పాల్పడ్డాడు.మద్యం మత్తులో ఉన్న కిట్టు కత్తి తీసుకొని తండ్రి రమేష్ ని వెంబడించి మరి హత్య చేశాడు. కిట్టు దారుణంగా తండ్రి పై దాడి చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న ప్రజలు చూస్తూ నిలబడ్డ కూడా పెంపుడు కుక్క మాత్రం కిట్టు నీ అడ్డుకోవటానికి ప్రయత్నించింది.
కానీ పూర్తిగా మత్తులో ఉన్న కిట్టు అడ్డుగా వచ్చిన కుక్క మీద కూడా కత్తితో దాడి చేశాడు. స్థానికులు ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.పోలీసులు స్థానికులను ఈ ఘటన గురించి విచారించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో దారుణానికి పాల్పడిన కిట్టు మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన గురించి పోలీసులు కేసు నమోదు చేసుకుని హత్యకు పాల్పడిన కిట్టు నీ అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం కత్తితో తండ్రిని వెంబడించి హత్య చేశాడు. అందరూ చూస్తుండగానే కిట్టు తండ్రిపై కత్తితో దాడి చేసి దారుణంగా చంపాడు. అయితే.. కిట్టు.. తండ్రిపై దాడి చేస్తున్న క్రమంలో.. పెంపుడు శునకంపై అడ్డుకోబోయింది. ఈ క్రమంలో దానిపై కూడా కిట్టు కత్తితో దాడి చేశాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తండ్రిని చంపిన కొడుకుపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Read Also : Aadhar Mobile Number: ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ కు లింక్ చేశారో మర్చిపోయారా.. అయితే ఇలా తెలుసుకోండి!