...

Child Marriage: పదిహేనెళ్ల పిల్లకు పెళ్లి, బలవంతపు శోభనం.. చేయించింది ఎవరో తెలుసా?

Child Marriage: తొమ్మిదో తరగతి చదివే పిల్లకు పెళ్లి జరిపించారు కుల పెద్దలు. భార్యాభర్త మధ్య వచ్చిన గొడవలు, విడాకుల కారణంగా కుల పెద్దలు మధ్యలోకి రావాల్సి వచ్చింది. వారిచ్చిన తీర్పు పాటించలేదని అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేశారు. అంతేనా పాప వద్దూ వద్దంటున్న శోభనం కూడా జరిపించి తమ కసాయితనాన్ని బయట పెట్టారు. తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గంధసిరికి చెందిన ఉప్పలరాజుకు ఖమ్మం పట్టణం పాకబండ బజారుకు చెంది బొజ్జమ్మతో 16 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరిద్దరికి నలుగురు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. గత కొంత కాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. క్రమంలోనే విడాకులు తీసుకునేందుకు సిద్ధం అయ్యారు. కానీ కోర్టుకు వెళ్తే తమ పరువు పోతుందంటూ కుల పెద్దలు వచ్చారు. తాము చెప్పినా దంపతులు వినడం లేదని పగబట్టారు.

తల్లి సమక్షంలో పదిహేనేళ్ల పాపకు పెళ్లి చేయించారు. రోజూ అమ్మాయికి ఇష్టం లేకపోయినా అబ్బాయితో చెప్పి అత్యాచారం చేయించారు. తండ్రి ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి కుల పెద్దలపై కేసు పెట్టారు. తమిద్దరి మధ్య ఉన్న గొడవ కారణంగా పిల్లకు పెళ్లి చేస్తున్నా ఏం చేయలేకపోయినందుకు భార్యతో గొడవ పడ్డాడు.