Road accident : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లాతూర్-అంబాజోగాయి వద్ద ఎందురెదురుగా వస్తున్న క్రూజర్ వాహనం, ట్రక్కు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏరుగురు అక్కడి కక్కడే దుర్మరణం చెందారు. అలాగే మరో 11 మంది తీవ్రంగా గాయ పడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నాయి. అయితే విషయం గుర్తించిన స్థానికులు వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు. అందులో తీవ్రంగా గాయపడ్డ వారిని 108 అంబులెన్స్ ద్వారా వెంటనే ఆస్పత్రికి తరలించారు. అలాగే పోలీసులకు కూడా సమాచారం అందించారు.

Road accident
విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే ఈ రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేశారు. ప్రమాదం ఎలా జరిగింది, తప్పు ఎవరిది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అంతే కాకుండా చనిపోయిన వారు ఏ గ్రామానికి చెందిన వారనే విషయాలపై కూడా కూపీ లాగుతున్నారు. అ
Read Also :Electric bike blast : ఎలక్ట్రిక్ బైక్ పేలి వ్యక్తి మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు!